Prashant Kishore సలహా తోనే వరి ధాన్యం పై రాజకీయం - DK Aruna | Oneindia Telugu

2022-03-23 17

DK Aruna was outraged that KCR was politicizing paddy procurement on the advice of the PK team.
#Dkaruna
#Cmkcr
#prashantkoshore
#paddyprocurement
#telangana
#hyderabad
#pmmodi

టిఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరి ధాన్యంపై కెసిఆర్ అనవసరపు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన డీకే అరుణ కెసిఆర్ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఎటువంటి వివక్ష లేదని డీకే అరుణ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరించిందని అయినప్పటికీ కుట్రపూరితంగా కేంద్రాన్ని విమర్శిస్తున్నారు అంటూ డీకే అరుణ ధ్వజమెత్తారు.

Videos similaires